Mon Dec 23 2024 07:34:14 GMT+0000 (Coordinated Universal Time)
దగ్గుబాటి రానాపై కేసు నమోదు
హీరో దగ్గుబాటి రానాపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అలాగే నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుపైన కూడా కేసు నమోదయింది.
హీరో దగ్గుబాటి రానాపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అలాగే సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుపైన కూడా కేసు నమోదయింది. ఫిలింనగర్ భూ వివాదంలో దౌర్జన్యంగా తమను ఖాళీ చేయించారంటూ ప్రమోద్ కుమార్ అనే వ్యాపారి ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
దౌర్జన్యం చేశారంటూ...
తొలుత వ్యాపారి ప్రమోద్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని హెచ్చరించారని, బెదిరింపులకు దిగారని బాధితుడు ఆరోపిస్తున్నారు. దీంతో నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు దగ్గుబాటి సురేష్ బాబు, రానాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు.
Next Story