Mon Dec 23 2024 17:56:46 GMT+0000 (Coordinated Universal Time)
వైశాలి కిడ్నాప్ కేసు : కోర్టులో సంచలన విషయాలు చెప్పిన నిందితుడు
నాగర్‌కర్నూల్ జిల్లా ముచ్చర్లపల్లికి చెందిన దామోదర్‌రెడ్డి సైన్యంలో పనిచేసి కొన్నేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్
శుక్రవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా.. మన్నెగూడలో దంత వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కలకలం రేపింది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 6 గంటల్లో కేసును చేధించారు. యువతిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటనలో 8 మందిని అరెస్ట్ చేశారు. యువతికి నిశ్చితార్థం రోజున.. మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి కిడ్నాప్ చేయించడం ఉద్రిక్తతకు దారితీసింది. తనను ప్రేమించి మరొక వ్యక్తితో పెళ్లికి సిద్ధమవ్వడంతోనే నవీన్ రెడ్డి ఆమెను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.
నాగర్‌కర్నూల్ జిల్లా ముచ్చర్లపల్లికి చెందిన దామోదర్‌రెడ్డి సైన్యంలో పనిచేసి కొన్నేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మన్నెగూడలో కుటుంబంతో స్థిరపడ్డారు. కుమార్తె వైశాలి (24) నగరంలో బీడీఎస్ చదువుతోంది. బొంగుళూరులోని ఓ బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రంలో ఆమెకు హస్తినాపురం నివాసి మిస్టర్ టీ కంపెనీ ఎండీ, నల్గొండజిల్లా ముషంపల్లికి చెందిన కె.నవీన్‌రెడ్డి (29)తో 2021లో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమగా మారింది. పెళ్లికి ఇరుకుటుంబాలు అంగీకరించాయి. రెండు కుటుంబాలు కలిసి గోవా, విశాఖపట్నం తదితర పర్యాటక ప్రాంతాలు చుట్టొచ్చాయి. ఆ తర్వాత పెళ్లి విషయంలో కుటుంబాల మధ్య స్పర్థలు తలెత్తాయి. అప్పటి నుంచి ఆమె నవీన్‌రెడ్డిని దూరంగా ఉంచింది. ఈ క్రమంలో కుటుంబ పెద్దలు మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారు.
"గతేడాది ఆగస్టు 4న ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్ల గ్రామంలోని దేవాలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం మేము పెళ్లి చేసుకున్నాం. తన కూతురు బీడీఎస్ పూర్తి చేసేంత వరకూ పెళ్లి విషయం బయట పెట్టవద్దని ఆమె తండ్రి కోరారు. కొత్తగా కొనుక్కున్న కారుకు ఆమే నామినీ. ఈ ఏడాది జులై 1 నుంచి ఆమె తల్లిదండ్రులు బెదిరించి నా భార్య మనసు మార్చారు." అని పేర్కొంటూ రంగారెడ్డి జిల్లా కోర్టులో నవీన్ రెడ్డి కేసు వేశాడు. తనకు విడాకులు ఇవ్వకుండానే మరొకరితో పెళ్లికి సిద్ధపడుతోందని ఆధారాలు చూపుతూ కోర్టు ద్వారా పోలీసులకు, యువతి కుటుంబీకులకు నోటీసులు పంపాడు. కాగా.. విజయవాడలో సీఏ ఇంటర్ తర్వాత.. మిస్టర్ టీ పేరుతో వ్యాపారం ప్రారంభించిన నవీన్ రెడ్డికి.. దేశవ్యాప్తంగా 400 వరకూ ఫ్రాంచైజీలు ఉన్నాయి.
Next Story