Thu Dec 26 2024 04:09:29 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్లో డ్రగ్స్లో కలకలం
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ను విక్రయిస్తున్న నిందితుడిని అరెస్ట్ చేశారు
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ ను ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ను విక్రయిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముంబయి నుంచి డగ్ర్స్ తీసుకు వచ్చి విక్రయిస్తున్నానని నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించారు. రాజేంద్ర నగర్ లోని హిమాయత్ సాగర్ వద్ద ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తుండగా ఎన్ఓటీ పోలీసులు పట్టుకున్నారు.
ఆడి కారులో వచ్చి...
ఆడి కారులో వచ్చిన పాతబస్తీకి చెందిన మహ్మద్ హమీద్ ఆలీ కొందరికి డ్రగ్స్ విక్రయిస్తుండగా ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. అందిన సమాచారంతో రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న దానిపై సమాచారం సేకరిస్తున్నారు.
Next Story