Mon Dec 23 2024 11:49:30 GMT+0000 (Coordinated Universal Time)
శిల్పా బ్యాంకు లాకర్లను నేడు
శిల్పా చౌదరి కేసులో నేడు పోలీసులు బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్నారు.
శిల్పా చౌదరి కేసులో నేడు పోలీసులు బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్నారు. శిల్పా చౌదరిని మరొక రోజు పోలీస్ కస్టడీకి అనుమతించడంతో ఆమె బ్యాంక్ లాకర్లను తనిఖీ చేయనున్నారు. ఇప్పటికి శిల్పా చౌదరిని రెండుసార్లు నార్సింగ్ పోలీసులు విచారణ చేశారు. అయినా ఆమె నోరు విప్పలేదు. బ్యాంకు అకౌంట్లను కూడా సీజ్ చేశారు.
విచారణలో.....
ఫలితం లేకపోవడంతో ఈరోజు శిల్పా చౌదరికి చెందిన బ్యాంకు లాకర్లను తెరవాలని పోలీసులు నిర్ణయించారు. శిల్పా చౌదరి ప్రముఖుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన సంగతి తెలిసిందే. విచారణలో శిల్పా ఏమీ చెప్పక పోవడంతో ఈరోజు బ్యాంకు లాకర్లను పోలీసులు తెరవనున్నారు. మరికొద్దిసేపట్లో శిల్పా చౌదరిని చంచలగూడ జైలు నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.
Next Story