అంత గొప్ప పుల్లారెడ్డి కుటుంబంలో ఇలాంటి ఘటనా ?
సమాజం ఛీత్కరించుకునేలా వ్యవహరించాడు పుల్లారెడ్డి మనవడు ఏక్ నాథ్ రెడ్డి. భార్యను హింసించడమే కాకుండా..
హైదరాబాద్ : పుల్లారెడ్డి స్వీట్స్.. ఇవి కేవలం హైదరాబాద్ లో, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. విదేశాల్లోను బాగా ఫేమస్. ఈ స్వీట్స్ ఒక్కసారి రుచి చూసిన వారు ఓ పట్టాన వదలరంటే నమ్మండి. నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయే నేతి మిఠాయిలకు పుల్లారెడ్డి స్వీట్స్ పెట్టింది పేరు. కేవలం రుచికరమైన స్వీట్లు చేయడంతోనే వారికి ఇంతగొప్ప పేరు వచ్చిందనుకుంటే పొరపాటే. పుల్లారెడ్డి, ఆయన కొడుకు రాఘవరెడ్డిలు ఎన్నో సామాజిక సేవలు చేశారు. రాఘవరెడ్డి విశ్వహిందూపరిషత్ అంతర్జాతీయ ప్రెసిడెంట్ గా కూడా సేవలందించారు. అలాంటి గొప్ప పేరున్న కుటుంబానికి ఏక్ నాథ్ రెడ్డి మాయని మచ్చలా మారాడు. పెళ్లాడిన భార్యకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవాల్సింది పోయి.. ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. పుల్లారెడ్డి కుటుంబంలో ఊహించని ఘటన జరిగింది. సమాజంలో ఎంతో పరపతి ఉన్న ఈ కుటుంబంలో కలహాలు రేగాయి. పోలీసుల రంగప్రవేశంతో విషయం మీడియా దృష్టికి వచ్చింది.