Mon Dec 23 2024 05:31:13 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభాస్ అభిమాని ఆత్మహత్య.. సినిమానే కారణమా ?
కర్నూలు నగరంలోని తిలక్ నగర్ లో నివాసముంటున్న రవితేజ (24) వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాధేశ్యామ్..
కర్నూల్ : ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా ఈ శుక్రవారం (మార్చి 11న) విడుదలైంది. అభిమానులు సినిమా క్లాసిక్ గా బాగుందని చెప్పినా.. సినీ క్రిటిక్స్, సాధారణ ప్రేక్షకులు మాత్రం సినిమా ఊహించిన స్థాయిలో లేదని రివ్యూ ఇచ్చారు. దీంతో రాధేశ్యామ్ కు మిక్స్ డ్ టాక్ వచ్చింది. తమ అభిమాన హీరో నటించిన సినిమాకు మిక్స్ డ్ టాక్ రావడం, సినిమా ఫ్లాప్ అయిందని నెగిటివ్ టాక్ రావడంతో ప్రభాస్ అభిమాని ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు.
వివరాల్లోకి వేళ్తే.. కర్నూలు నగరంలోని తిలక్ నగర్ లో నివాసముంటున్న రవితేజ (24) వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాధేశ్యామ్ సినిమాకు తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. సినిమాకు వెళ్లొచ్చాక తన ఇంట్లోనే రవితేజ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఊరికి వెళ్లిన తల్లి అతనికి ఫోన్ చేసినా తీయలేదు. శనివారం ఉదయం స్నేహి తులు, ఇంటి తలుపు తట్టినా స్పందించలేదు. వెల్డింగ్ యంత్రంతో తలుపును తొలగించి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు.
వెంటనే కిందికి దించి ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు అతను చనిపోయినట్లు నిర్థారించారు. రాధేశ్యామ్ సినిమా పెద్దగా బాగా లేదన్న బాధతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకొన్నట్లు మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు కర్నూలు నాలుగో పట్టణ ఎస్సై రామయ్య తెలిపారు.
Next Story