Sun Dec 22 2024 19:43:46 GMT+0000 (Coordinated Universal Time)
Praneeth Hanumanthu: ప్రణీత్ అమెరికా పారిపోవాలనుకున్నాడా.. ఎలా పట్టుకున్నారంటే?
యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై పోలీసులు కేసు నమోదు చేశారు
కొద్దిరోజుల క్రితం ఓ మైనర్ బాలికపై అసభ్యకరమైన లైంగిక వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) అదుపులోకి తీసుకుంది. బెంగుళూరులో పోలీసులు అతడిని పట్టుకోగలిగారు. అతడిని అదుపులోకి తీసుకుని అక్కడి స్థానిక కోర్టులో హాజరుపరిచారు.
అమెరికాకు పారిపోతుండగా బెంగళూరులో అతడిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్, డల్లాస్ నాగేశ్వర్రావు, మరో ఇద్దరు కలిసి ‘డార్క్ కామెడీ’ పేరుతో ఓ తండ్రీ-కూతురు వీడియోపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హీరో సాయిధరమ్ తేజ్ స్పందించారు. ప్రణీత్‌పై చర్యలు తీసుకోవాలని టాలీవుడ్ నటులు మంచు మనోజ్, విశ్వక్సేన్, అడివిశేష్, కార్తికేయ, సుధీర్‌బాబు సహా పలువురు ఏపీ, టీజీ ప్రభుత్వాలను కోరారు. ఈ నేపథ్యంలో ప్రణీత్‌ను అరెస్టు చేసిన పోలీసులు మిగతా ముగ్గురిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు.
ప్రణీత్ సోషల్ మీడియాలో పలువురిని ట్రోల్ చేస్తూ పాపులారిటీని సంపాదించుకున్నాడు. సుధీర్ బాబు నటించిన హరోమ్ హర సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. ఈ వివాదం తర్వాత సుధీర్ బాబు మాట్లాడుతూ, తనను సినిమాలో నటింపజేసినందుకు అసహ్యంగా భావిస్తున్నానని, అందుకు క్షమాపణలు చెబుతున్నానన్నాడు.
Next Story