Fri Jan 03 2025 02:46:26 GMT+0000 (Coordinated Universal Time)
మచిలీపట్నం ఉర్దూ పాఠశాల హాస్టల్ లో ప్రిన్సిపల్ రాసలీలలు
ప్రిన్సిపల్ - కాంట్రాక్ట్ ఉద్యోగిని రాసలీలల గురించి తెలిసిన విద్యార్థులు ఎలాగైనా వారి బండారం బయటపెట్టాలని భావించి..
విద్యా బుద్ధులు నేర్పి.. పిల్లల భవిష్యత్ కు మంచి దారి చూపించాల్సిన ఉపాధ్యాయులే.. కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. స్కూళ్ల ప్రిన్సిపల్స్ లేదా మాస్టర్లు.. స్కూల్ లో సహ ఉద్యోగులతో ఎఫైర్లు పెట్టుకోవడం లేదా.. విద్యార్థినులను వేధించడం షరా మామూలైపోయింది. ఎన్నిచట్టాలొచ్చినా.. లెక్కచేయకుండా తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. తాజాగా కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఓ ఉర్దూ పాఠశాల హాస్టల్ లో ప్రిన్సిపల్ ఆనందప్రసాద్, కాంట్రాక్ట్ యూడీసీ ఉద్యోగిని రాసలీలల వీడియో బయటికొచ్చింది.
ప్రిన్సిపల్ - కాంట్రాక్ట్ ఉద్యోగిని రాసలీలల గురించి తెలిసిన విద్యార్థులు ఎలాగైనా వారి బండారం బయటపెట్టాలని భావించి.. వాళ్లిద్దరూ కలిసుండగా వీడియో తీశారు. మైనార్టీ ఉర్దూ పాఠశాల ప్రిన్సిపల్ హాస్టల్లో యుడిసి ఉద్యోగిని మహిళాతో శృంగారం చేస్తూ ఉండగా విద్యార్థులు వీడియో చిత్రీకరించారన్న కోపంతో.. విద్యార్థులను చితకబాదాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో పోలీసులు ప్రిన్సిపల్ పై కేసు నమోదు చేశారు. వారిద్దరి మధ్య కొన్నినెలలుగా ఈ తంతు జరుగుతుందని విద్యార్థులు పోలీసులకు తెలిపారు.
Next Story