Wed Apr 23 2025 05:25:45 GMT+0000 (Coordinated Universal Time)
విజయవాడ - హైదరాబాద్ హైవేపై బస్సు దగ్గం.. ఒకరు సజీవ దహనం
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఒక ప్రయివేటు ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతి అయింది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు

విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఒక ప్రయివేటు ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతి అయింది. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు. నార్కేట్ పల్లి వద్ద ఈ ఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంది. హైదరాబాద్ కు వస్తున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ముందుగా పొగలు రావడంతో ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. బస్సులో మొత్తం 39 మంది ప్రయాణికులున్నారు.
ఒకరు మృతి...
బస్సు పూర్తిగా దగ్దమయింది. అయితే తర్వాత చూస్తే బస్సులో ఒక మృతదేహాన్ని గుర్తించారు. ఆ మృతదేహం ఎవరిదన్నది తెలియ రాలేదు. ప్రయాణికుడు వెనక భాగంలో కూర్చుని ఉండటం ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో నిద్రమత్తులో ఉన్న అతడు లేదా ఆమె తప్పించుకోలేకపోయాడన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రయాణికుల జాబితా బస్సు యజమాన్యం చెబితే తప్ప మరణించింది ఎవరో తెలియదు.
Next Story