Fri Nov 22 2024 15:13:02 GMT+0000 (Coordinated Universal Time)
అవును ఆ వైద్యుడు హాస్పిటల్ కి వచ్చిన వారితో అలా ప్రవర్తించేవాడు.. 10 సంవత్సరాలు జైలు శిక్ష
ఆ వైద్యుడు హాస్పిటల్ కి వచ్చిన వారితో అలా ప్రవర్తించేవాడు
చికిత్సకోసం ఆసుపత్రికి వచ్చిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వైద్యుడి నేరం రుజువు కావడంతో ధర్మాసనం నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ప్రముఖ పల్మనాలజిస్ట్ విజయ్ భాస్కర్ కు 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్టు సికింద్రాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగిపై పలు సందర్భాల్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. లైంగిక వేధింపుల ఆరోపణలపై నాంపల్లి కోర్టు మంగళవారం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతోపాటు రూ. 5వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది.
మహిళ ఊపిరితిత్తుల సమస్యతో 2016 మే 13న హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ హాస్పిటల్ కి వెళ్ళింది. ఆమెను పరీక్షించిన డాక్టర్ మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ లోని భాస్కర చెస్ట్ క్లినిక్ కు రెఫర్ చేశారు. ఆ తర్వాత ఆమె ఆ ఆసుపత్రికి వెళ్ళింది. ఈ క్రమంలో డాక్టర్ విజయ భాస్కర్ వైద్య పరీక్షల పేరుతో గదిలోనికి తీసుకెళ్లి మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె ప్రైవేట్ పార్ట్ లను తాకుతూ, వేధింపులకు పాల్పడ్డాడు. మహిళ ప్రశ్నించగా వైద్యపరీక్షల్లో ఇది భాగమేనని అంటూ ఆమెను నమ్మించాడు. ఆ తర్వాత బాధితురాలు మందులు తీసుకుని అమెరికా వెళ్లిపోయింది. అక్కడ మరోసారి ఊపిరితిత్తుల సంబంధిత సమస్య తలెత్తడంతో హైదరాబాదుకు తిరిగి వచ్చింది. మళ్లీ అదే ఆసుపత్రికి వెళ్ళింది. నిందితుడైన వైద్యుడిని సంప్రదించింది. చెకింగ్ సమయంలో డాక్టర్ మళ్ళీ ఆమెతో అలాగే అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితురాలికి అతని పాడు బుద్ధి తెలిసింది. బాధితురాలు తన తల్లితో కలిసి వైద్యుడిపై గొడవకు దిగింది. అనంతరం తల్లితో కలిసి గోపాలపురం పోలీసులను ఆశ్రయించింది.డాక్టర్ పై ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అతడి లైంగిక వేధింపుల కారణంగా విజయ్ కుమార్ ను అరెస్టు చేశారు. ఈ కేసును మంగళవారం విచారించిన నాంపల్లి స్టేషన్ సబ్ కోర్టు జడ్జి కవిత నిందితుడికి 10 సంవత్సరాల జైలుశిక్ష జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఇతర పేషంట్ ల పై సైతం అదే రీతిలో వైద్యుడు వ్యవహరించాడనే ఆరోపణలు ఉన్నాయి.
News Summary - Prominent Pulmonologist Dr Vijay Bhasker Sentenced To 10 years
Next Story