Sun Dec 22 2024 21:18:52 GMT+0000 (Coordinated Universal Time)
స్పా ముసుగులో పాడు పనులు.. క్రాస్ మసాజ్ కూడా!
స్పాలు, మసాజ్ సెంటర్ల పై మెరుపు దాడులు జరిగాయి. సీసీఎస్ టీమ్తో కలిసి బంజారాహిల్స్
స్పా.. మసాజ్ సెంటర్లు.. పెద్ద పెద్ద నగరాల్లో సర్వ సాధారణమే! అయితే ఈ స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు అధికమయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో మెరుపు దాడులకు దిగారు పోలీసులు.
స్పాలు, మసాజ్ సెంటర్ల పై మెరుపు దాడులు జరిగాయి. సీసీఎస్ టీమ్తో కలిసి బంజారాహిల్స్, ఫిల్మ్నగర్లో యాంటీ ట్రాఫికింగ్ సెల్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. శనివారం బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. మసాజ్ సెంటర్లపై యాంటీ ట్రాఫికింగ్ సెల్ దాడులు చేసింది. మేఘవి వెల్నెస్ స్పా, రువాన్ థాయ్ స్పా, సెన్సెస్ ట్రాంక్విల్ ది హెల్త్ స్పా, కానస్ లగ్జరీ స్పా, బోధి వెల్నెస్ స్పా సెంటర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు, క్రాస్ మసాజ్ లకు పాల్పడుతున్నట్లు తేలింది. సీసీ కెమెరాలు లేకపోవడం.. రిజిస్టర్లో కస్టమర్ల వివరాలు రాయక పోవడం లాంటి ఉల్లంఘనలకు పాల్పడిన నిర్వాహకుల మీద కేసు నమోదు చేశారు.
Next Story