Fri Dec 20 2024 19:38:37 GMT+0000 (Coordinated Universal Time)
ఏ తండ్రీ చేయని దారుణం చేశాడు.. స్కూల్ లో అధ్యాపకులకు డౌట్ రాగా!
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆ చిన్నారి జీవితాన్ని
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆ చిన్నారి జీవితాన్ని చిదిమేసాడు. తన 11 ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై 35 ఏళ్ల వ్యక్తిని పూణే పోలీసులు అరెస్టు చేశారు. మైనర్పై లైంగిక దాడి జరిగిన విషయం బాలిక చదువుతున్న పాఠశాలలో తెలియడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ పోలీసులను ఆశ్రయించడంతో తండ్రిపై భారతీయ న్యాయ సంహిత (BNS) అలాగే లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం కింద అత్యాచారం కేసు నమోదు చేశారు.
నిందితుడు తన కుమార్తెకి అశ్లీల వీడియోలు చూపించేవాడని, ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని వార్జే పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి నాలుగు రోజుల పోలీసు కస్టడీకి తరలించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ 3) శంభాజీ కదమ్ తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన తండ్రిని దారుణంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Next Story