Mon Dec 23 2024 06:33:22 GMT+0000 (Coordinated Universal Time)
5 మందిని చంపిన అతడు కూడా శవమై కనిపించాడు
భార్య, అత్తమామలు, ఇద్దరు పిల్లలను నిప్పంటించిన వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. లూథియానా జిల్లాలోని అతని స్వస్థలమైన ఖురద్పూర్ గ్రామంలో, బాధితుడు సట్లెజ్ నది ఒడ్డుకు సమీపంలో శవమై కనిపించాడు. 30 ఏళ్ల కుల్దీప్ సింగ్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు. మెహత్పూర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మాట్లాడుతూ.. తన కుటుంబాన్ని చంపి తప్పించుకుని తిరిగిన సదరు వ్యక్తి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. మీడియా నివేదికల ప్రకారం, నిందితుడు అక్టోబర్ 18 న అతడి కుటుంబం నిద్రిస్తున్న సమయంలో తన అత్తమామల ఇంటిలోకి చొరబడి, పెట్రోల్ పోసి అందరినీ తగులబెట్టాడు.
భార్య, ఆమె కుటుంబ సభ్యులైన నలుగురిని సజీవ దహనం చేసాడని మంగళవారం పోలీసులు తెలిపారు. పరమజీత్ కౌర్, ఆమె ఇద్దరు మైనర్ పిల్లలు పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో ఐదు-ఆరు నెలలుగా తన తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. లుథియానాలోని ఖుర్షెడ్‌పూర్ గ్రామంలోని తన ఇంటికి తిరిగి రావాలని భర్త కుల్దీప్ సింగ్ కోరుకున్నాడు.. అయితే కుల్దీప్ తనను, పిల్లలను కొట్టేవాడని ఆరోపిస్తూ ఆమె తిరిగి వెళ్లడానికి నిరాకరించిందని పోలీసులు తెలిపారు. సోమవారం అర్థరాత్రి, కుల్దీప్.. నిద్రిస్తున్న ఐదుగురు బాధితులపై పెట్రోల్ పోసి నిప్పంటించారని జలంధర్ (రూరల్) పోలీసు సూపరింటెండెంట్ సత్బ్జిత్ సింగ్ ఫోన్లో తెలిపారు. మృతులను పరమ్‌జిత్ కౌర్, ఆమె తండ్రి సుర్జన్ సింగ్, తల్లి జోగిందర్, ఆమె ఇద్దరు పిల్లలు అర్ష్‌దీప్ (8), అన్మోల్ (5)గా గుర్తించారు. కుల్దీప్ సింగ్ నిత్యం తాగివచ్చి కొడుతుండటంతో పరంజీత్ తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. కుల్దీప్ లో మార్పు రాకపోవడంతో ఆమె పుట్టింటి నుంచి తిరిగి రావడానికి నిరాకరించింది.
Next Story