Mon Dec 23 2024 07:00:09 GMT+0000 (Coordinated Universal Time)
అద్దె విషయంలో గొడవ.. అన్నను పొడిచి చంపిన తమ్ముడు
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్ కమ్యూనిటీ హాల్ సమీపంలో.. అస్సాంకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు అంజన్..
అద్దె చెల్లింపు విషయంలో అన్నదమ్ముల మధ్య మొదలైన గొడవ తారాస్థాయికి చేరింది. నువ్వే అద్దె కట్టాలంటే.. నువ్వే కట్టాలంటూ.. ఒకరిపై మరొకరు దూషించుకున్నారు. కోపం కంట్రోల్ తప్పిన అన్న చేతిలో ఉన్న చపాతి కర్రతో తమ్ముడిని కొట్టాడు. దాంతో తీవ్ర ఆవేశానికి గురైన తమ్ముడు అన్నను కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్ కమ్యూనిటీ హాల్ సమీపంలో.. అస్సాంకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు అంజన్, రంజన్ నివసిస్తున్నారు. గతరాత్రి ఇంటి అద్దె చెల్లింపు విషయమై ఇద్దరి మధ్యన గొడవ జరిగింది. అద్దె నువ్వంటే.. నువ్వు కట్టాలని చిన్నగా మొదలైన వాదన పెద్ద గొడవకు దారితీసింది. దాంతో అన్న చపాతి కర్రతో తమ్ముడిని కొట్టాడు. నన్నే కొడతావా అంటూ తమ్ముడూ తనచేతికి అందిన కూరగాయల కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అన్న అంజన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంజన్ బోరా డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తమ్ముడు రంజన్ బోరాని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story