Mon Dec 23 2024 06:33:25 GMT+0000 (Coordinated Universal Time)
కరుడుగట్టిన గజదొంగ అరెస్ట్
రాసికుల్ ఖాన్ ను పట్టుకునేందుకు రాచకొండ సీసీఎస్ పోలీసులు ఎంతో కృషి చేశారు. అతని కోసం వెతకని ప్రాంతమంటూ లేదు.
కరుడుగట్టిన గజదొంగ రాసికుల్ ఖాన్ ను రాచకొండ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాసికుల్ ఖాన్ ను వెస్ట్ బెంగాల్ లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇతను 2006 నుంచి పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తూ.. పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. రాచకొండ పీఎస్ పరిధిలోనే 17 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన రాసికుల్ పై.. పలు రాష్ట్రాల్లో వందల కొద్ది దొంగతనాల కేసులు నమోదయ్యాయి.
Also Read : హైదరాబాద్ లో ప్రధాన పార్కులన్నీ మూసివేత
రాసికుల్ ఖాన్ ను పట్టుకునేందుకు రాచకొండ సీసీఎస్ పోలీసులు ఎంతో కృషి చేశారు. అతని కోసం వెతకని ప్రాంతమంటూ లేదు. నిందితుడిని పట్టుకునేందుకు 70 వేల ఫోన్ నంబర్లను పరిశీలించగా.. ఆఖరికి వెస్ట్ బెంగాల్ లో అతను దొరికినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, గోవా రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడిన రాసికుల్ ఖాన్ నుంచి పోలీసులు 52 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Next Story