Sun Apr 06 2025 22:48:02 GMT+0000 (Coordinated Universal Time)
Raging in Ramagundam college: రామగుండంలో కాలేజీలో ర్యాగింగ్... గుండు కొట్టించి.. మీసాలు తీసేసి
రామగుండం మెడికల్ కళాశాలలో ర్యాంగింగ్ కలకలం రేగింది. ఇద్దరు జూనియర్లను సీనియర్లు వేదించారు.

Raging in Ramagundam college:రామగుండం మెడికల్ కళాశాలలో ర్యాంగింగ్ కలకలం రేగింది. ఇద్దరు జూనియర్లను సీనియర్లు వేదించారు. వారికి కేశఖండన చేసి అవమానర్చారు. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు దర్యాప్తు చేస్తున్నారు. రామగుండంలోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులను సీనియర్ విద్యార్ధులు గుండు కొట్టి, మీసాలు తీశారు. ట్రిమ్మర్ తో ఈ పనిచేసినట్లు విద్యార్థులు చెబుతున్నారు. తాము వారిస్తున్నా వినలేదని, ప్రాధేయపడినా కనికరించలేదని విద్యార్థులు వాపోయారు.
నలుగురు విద్యార్థులపై....
ర్యాగింగ్ లో నలుగురు సీనియర్ విద్యార్థులు పాల్గొనట్లు తెలిపారు. దీంతో జూనియర్లు ఇద్దరూ తమ తల్లిదండ్రులకు విషయం తెలియజేయగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మరో వైపు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వైస్ ప్రిన్సిపాల్ ఛాంబర్ ఎదట ఆందోళనకు దిగారు. సీనియర్లపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story