Thu Dec 19 2024 15:42:00 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్ట్ చేశారు
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో రహేల్ను అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న రహేల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహేల్ పై హైదరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో...
ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన రహేల్ తర్వాత దుబాయ్ పారిపోయాడు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చివరకు ఈరోజు దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఎయిర్ పోర్టులో పట్టుకున్నారు. రోడ్డు ప్రమాదం తర్వాత మరొకరిని ఈ కేసులో డ్రైవర్ గా మార్చిన రహేల్ కు పోలీసులు షాకిచ్చారు. సీసీ టీవీ ఫుటేజీ చూసి అతనిపై కేసు నమోదు చేశారు.
Next Story