Mon Dec 23 2024 17:35:26 GMT+0000 (Coordinated Universal Time)
Breaking: నాగపూర్ లో కూలిన వంతెన
నాగపూర్ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి కుప్పకూలింది. ఈ వంతెన కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం అందుతుంది.
నాగపూర్ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి కుప్పకూలింది. ఈ వంతెన కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం అందుతుంది. ఒక్కసారిగా కుప్పకూలడంతో స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. అయితే ఈ బ్రడ్జి కింద ఎంత మంది చిక్కుకున్నారన్న విషయం తెలియరాలేదు.
సహాయక చర్యలు...
ఈ వంతెన కూలిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. సహాయక చర్యలు మాత్రం ప్రారంభమయ్యాయి. శిధిలాల కింద ఎవరైనా ఉన్నారేమోనని సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
Next Story