Mon Dec 23 2024 11:08:56 GMT+0000 (Coordinated Universal Time)
రాజధాని ఎక్స్ ప్రెస్ కు తృటిలో తప్పిన ప్రమాదం
గుజరాత్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ముంబై నుంచి హజ్రత్ నిజాముద్దీన్ కు వెళ్తున్న ఆగస్టు క్రాంతి రాజధాని
రాజధాని ఎక్స్ ప్రెస్ కు తృటిలో రైలు ప్రమాదం తప్పింది. పట్టాలపై అడ్డుగా ఉన్న భారీ సిమెంట్ పిల్లర్ ను రాజధాని ఎక్స్ ప్రెస్ ను ఢీ కొట్టిన ఘటన గుజరాత్ లోని వల్సాడ్ వద్ద జరిగింది. గుజరాత్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ముంబై నుంచి హజ్రత్ నిజాముద్దీన్ కు వెళ్తున్న ఆగస్టు క్రాంతి రాజధాని ఎక్స్ ప్రెస్ కు శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. వల్సాడ్ సమీపంలో పట్టాలపై ఉన్న సిమెంట్ పిల్లను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
రైలు పిల్లర్ ను బలంగా ఢీ కొట్టడంతో అది ముక్కలు ముక్కలై ఎగిరిపడింది. వెంటనే లోకో పైలట్ జరిగిన ఘటనపై రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. కొందరు ఆకతాయిలు రైలును పట్టాలు తప్పించేందుకు పిల్లర్ ను అడ్డుగా పెట్టి ఉంటారని వల్సాడ్ రూరల్ పోలీసులు పేర్కొన్నారు. రైల్వే అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story