Mon Dec 23 2024 09:58:24 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో కల్తీ కల్లుకు నలుగురు బలి
తూర్పుగోదావరి రాజఒమ్మింగి మండలం లోదొడ్డిలో దారుణం చేసుకుంది. కల్తీ కల్లు తాగి నలుగురు గిరిజనులు మృతి చెందారు
తూర్పుగోదావరి రాజఒమ్మింగి మండలం లోదొడ్డిలో దారుణం చేసుకుంది. కల్తీ కల్లు తాగి నలుగురు గిరిజనులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కల్తీ కల్లు విక్రయించడంతోనే ఈ నలుగురు మృతి చెందారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
కల్తీ కల్లుతోనే....?
రాజఒమ్మింగి మండలం లోదొడ్డిలో కల్తీ కల్లు తాగిన గిరిజనులు మరణించడం సంచలనం సృష్టిస్తుంది. దీంతో కల్లు శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు శాఖతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా రంగంలోకి దిగి ఆ ప్రాంతంలో కల్లు దుకాణాలను మూసివేయించారు.
Next Story