Thu Mar 20 2025 15:18:09 GMT+0000 (Coordinated Universal Time)
నవీన్ మర్డర్ కేసులో నిహారిక ఫేస్ రివీల్ చేసిన ఆర్జీవీ
అంతటితో ఆగక అతని శరీర భాగాలను వేరు చేసి, తల-మొండేన్ని వేరు చేసి ఆ ఫోటోలను నిహారిక అనే యువతికి పంపించాడు.

గత నెల తెలంగాణలోని అబ్దుల్లాపూర్ మెట్ లో ప్రేమ విషయంలో స్నేహితుడిని మరో స్నేహితుడు అతి దారుణంగా చంపిన ఘటన దేశమంతా సంచలనం రేపింది. బీటెక్ విద్యార్థి అయిన నవీన్ ను అతని స్నేహితుడు అయిన మరో బీటెక్ విద్యార్థి హరిహర కృష్ణ ఫిబ్రవరి 18న దారుణంగా చంపిన విషయం తెలిసిందే. అంతటితో ఆగక అతని శరీర భాగాలను వేరు చేసి, తల-మొండేన్ని వేరు చేసి ఆ ఫోటోలను నిహారిక అనే యువతికి పంపించాడు. ప్రస్తుతం ఈ కేసులో ఏ1గా హరిహరకృష్ణ, ఏ2గా నిహారిక, ఏ3గా హసన్ లు ఉన్నారు. పోలీసుల విచారణలో హరిహర.. నవీన్ ను తాను హత్యచేసినట్లు అంగీకరించాడు.
అయితే.. ఇంతటి దారుణానికి కారణమైన ఆ యువతి ముఖాన్ని మాత్రం పోలీసులు బయటకు చూపించలేదు. నెటిజన్లు ఆమె ఎలా ఉందో చూడాలని తహతహలాడిపోతుంటే.. ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిహారిక ముఖాన్ని రివీల్ చేస్తూ.. ఓ ట్వీట్ చేశారు. ప్రేమ గుడ్డిదని తెలుసు కానీ.. మరీ ఇంత గుడ్డిది అని అనుకోలేదంటూ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. కొందరు ఆ అమ్మాయి ముఖాన్ని ఎందుకు చూపించావ్ అని ప్రశ్నిస్తుంటే.. మరికొందరు ఇదే ఓ అబ్బాయి వల్ల జరిగి ఉంటే ఈ పాటికి చంపేయాలని డిమాండ్ చేసేవారు కదా. అమ్మాయిలకో న్యాయం అబ్బాయిలకో న్యాయమా అని కామెంట్లు చేస్తున్నారు.
Next Story