Sun Dec 22 2024 16:27:35 GMT+0000 (Coordinated Universal Time)
పొలంలో గర్భిణీ మృతదేహం.. ఆమె మరణం వెనుక
రాంబిరికి వినోద్ అనే వ్యక్తితో 2015లో వివాహం జరిగింది. ఏడాది తర్వాత ఇద్దరూ విడిపోయారు. రాంబిరి తన తండ్రి ఇంట్లో ఉంటోంది
ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో పొలంలో గర్భిణి మృతదేహం లభించింది. ఆమెను దారుణంగా హత్య చేసి పొలంలో పడేసి వెళ్లిపోయారు. ఆ మృతదేహం లభించిన మూడు రోజుల తర్వాత, ఆమె హత్యకు సంబంధించి ఆమె ప్రేమికుడిని, మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంబిరి అనే మహిళ తలపై రాయితో మోది ఆదేశ్.. అతడి స్నేహితులు హత్య చేశారు. ఆమెను హత్య చేసిన తర్వాత, వారు ఆమె మృతదేహాన్ని పొలంలో వదిలి అక్కడి నుండి పారిపోయారు. రాంబిరిని హత్య చేశారంటూ బాధితురాలి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
రాంబిరికి వినోద్ అనే వ్యక్తితో 2015లో వివాహం జరిగింది. ఏడాది తర్వాత ఇద్దరూ విడిపోయారు. రాంబిరి తన తండ్రి ఇంట్లో ఉంటోంది. అక్కడ ఉన్నప్పుడు ఆమెకు ఆదేశ్ పరిచయమయ్యాడు. ఇద్దరూ సన్నిహితంగా ఉండడం మొదలైంది. రాంబిరి గర్భవతి అయింది. పెళ్లి చేసుకోవాలని ఆదేశ్ ను ఒత్తిడి చేయడం ప్రారంభించింది. ఆమె వైఖరితో విసిగిపోయిన ఆదేశ్ తన స్నేహితులతో కలిసి ఆమెను చంపేందుకు కుట్ర పన్నాడు. జూలై 2న ఆదేశ్ రాంబిరిని తన ఇంట్లో కలుద్దామని పిలిచాడు. ఆమె రాగానే అతని స్నేహితులతో కలిసి ఆమెను కొట్టి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని పొలంలో వదిలేశారు. జూలై 2న మహిళ హత్యకు గురైందని, ఒక రోజు తర్వాత ఆమె మృతదేహం పొలంలో లభ్యమైందని పోలీసులు ధృవీకరించారు. ఈ కేసులో మిగిలిన నలుగురు నిందితులు దీపక్, ఆర్యన్, సందీప్, రోహిత్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story