Mon Dec 23 2024 13:00:48 GMT+0000 (Coordinated Universal Time)
విదేశీ మహిళపై అత్యాచారయత్నం కేసు : రేపిస్ట్ వైసీపీ నేత ?
తాజాగా ఈ ఘటనపై టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా ఓ సంచలన ట్వీట్ చేసింది. నెల్లూరు జిల్లాలో బ్రిటన్ యువతిపై అత్యాచార యత్నానికి
అమరావతి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు (మార్చి 8) నెల్లూరు జిల్లాలో విదేశీ మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. మహిళ దుండగుల చెర నుంచి తప్పించుకుని, స్థానికుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన కొద్దిగంటల్లోనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సహా.. పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. మహిళా దినోత్సవం రోజున రాష్ట్రం, దేశం పరువు పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా ఈ ఘటనపై టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా ఓ సంచలన ట్వీట్ చేసింది. నెల్లూరు జిల్లాలో బ్రిటన్ యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడిన కామాంధుడు అధికార వైసీపీకి చెందిన నేతేనని ఆ ట్వీట్ లో ఆరోపించింది. అత్యాచార యత్నానికి పాల్పడ్డ వైసీపీ నేత పేరు అబిద్ అని, అతడు వైసీపీ ఎమ్మెల్యేలకు అనుచరుడు అని కూడా టీడీపీ తెలిపింది. స్వయంగా వైసీపీ లీడర్లు ఇలా ఏపీని అత్యాచారాంధ్రప్రదేశ్ గా మారుస్తుంటే.. మరోవైపు జగన్ రెడ్డి తానేదో మహిళలను ఉద్ధరించేసినట్టు అసెంబ్లీలో అబద్ధపు ప్రసంగాలు చేస్తున్నారంటూ సదరు ట్వీట్లో టీడీపీ విమర్శించింది. టీడీపీ చేసిన వరుస ట్వీట్లపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది.
Next Story