Mon Dec 23 2024 07:28:52 GMT+0000 (Coordinated Universal Time)
ఆస్పత్రిలో దారుణం.. మృతదేహం కన్ను తినేసిన ఎలుకలు
వెంటనే వాళ్లు వైద్యులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన మార్చురీకి చేరుకున్న వైద్యులు, అధికారులు మృతదేహాన్ని..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా.. పేషంట్లు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతేడాది వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో.. ఉన్న రోగులను బెంబేలెత్తించాయి ఎలుకలు. ఓ రోగిని ఎలుకలు పీక్కుతినగా.. రెండ్రోజులు హడావిడి చేశారు అంతే. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఎవరికీ తెలియదు. కాగా.. తాజాగా మధ్యప్రదేశ్ లో అలాంటి ఘటనే జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లా ఆస్పత్రిలో సిబ్బంది ఇటీవల ఓ మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. మరుసటి రోజు ఆ మృతదేహాన్ని సిబ్బంది పరిశీలించగా.. కన్ను పూర్తిగా దెబ్బతిన్న స్థితిలో కనిపించింది. వెంటనే వాళ్లు వైద్యులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన మార్చురీకి చేరుకున్న వైద్యులు, అధికారులు మృతదేహాన్ని పరిశీలించారు. కన్నును ఎలుకలు తిన్నట్టుగా అనుమానం వ్యక్తం చేశారు. కాగా.. అది ఎంత వరకూ నిజమన్నది తెలియాల్సి ఉంది. ఏం జరిగిందనేది తెలుసుకోవడానికి అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. గతంలో ఇదే ఆస్పత్రిలో ఓ మృతదేహాన్ని ఎలుకలు కొరికి తిన్నాయి. కాగా.. తాజాగా జరిగిన ఘటనపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందన్న విషయంపై ఆరా తీస్తున్నారు.
Next Story