Wed Jan 08 2025 06:27:19 GMT+0000 (Coordinated Universal Time)
అర్ధరాత్రి రేవ్ పార్టీ.. పోలీసుల దాడులు
హైదరాబాద్ నగరంలో రేవ్ పార్టీలు ఆగడం లేదు. పోలీసుల కళ్లుగప్పి మరీ రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో రేవ్ పార్టీలు ఆగడం లేదు. పోలీసుల కళ్లుగప్పి మరీ రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లష్కర్ గూడ సమీపంలోని ఒక పార్మ్ హౌస్ లో ఈ రేవ్ పార్టీ జరిగింది. అయితే పోలీసులకు సమాచారం అందడంతో రేవ్ పార్టీపై దాడి చేశారు. ఈ పార్టీలో మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఆరుగురు యువతులు కూడా...
ఆరుగురు యువతులు కూడా రేవ్ పార్టీలో పాల్గొన్నారు. ఘటన స్థలంలో పోలీసులకు హుక్కా పాట్ లు కూడా లభ్యమయ్యాయి. వనస్థలిపురానికి చెందిన ఒక మహిళ ఈ రేవ్ పార్టీని అరేంజ్ చేసినట్లు పోలీసులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. రేవ్ పార్టీపై దాడి జరిగిన విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. దీని వెనక పెద్దల హస్తం ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి.
Next Story