Mon Dec 23 2024 06:21:49 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ నడిబొడ్డున రేవ్ పార్టీ
హైదరాబాద్ లో రేవ్ పార్టీని వీకెండ్ లో పోలీసులు భగ్నం చేశారు
హైదరాబాద్ లో రేవ్ పార్టీని వీకెండ్ లో పోలీసులు భగ్నం చేశారు. శనివారం కావడంతో భారీ రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్లు పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ లో రేవ్ పార్టీని నిరవహిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో దాడులు చేవారు. పుడింగ్ మింక్ పబ్ పై దాడులు చేసి రేవ్ పార్టీని భగ్నం చేశారు.
భగ్నం చేసిన పోలీసులు....
తెల్లవారుజామున మూడు గంటలకు ఈ దాడులు నిర్వహించినట్లు తెలిసింది. రేవ్ పార్టీలో పాల్గొన్న మొత్తం 150 మంది యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమచారం. వీరందరినీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించి ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ రేవ్ పార్టీలో బిగ్ బాస్ తెలుగు విజేత రాహుల్ సిప్లిగింజ్ ఉన్నట్లు తెలుస్తోంది. యువతులు కూడా పెద్దసంఖ్యలో ఉన్నారని, పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story