Mon Dec 23 2024 02:25:50 GMT+0000 (Coordinated Universal Time)
సెటిల్మెంట్ కు పిలిచి కాల్చి చంపారు
హైదరాబాద్ లో జరిగిన కాల్పుల ఘటనలో రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాసరెడ్డి మృతి చెందాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. దీంతో ఘర్షణలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. ఈరోజు జరిగిన కాల్పుల కేసు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చెందినదే. భూముల ధరలు ఇటీవల కాలంలో ఒక్కసారిగా పెరగడంతో రియల్ వ్యాపారంలోనూ కక్షలు, కార్పణ్యాలు పెరిగాయి. ఈరోజు వీటికి శ్రీనివాసరెడ్డి అనే రియల్టర్ బలయిపోయాడు. ప్రత్యర్థులు జరిపిన కాల్పుల్లో ఆయన మరణించారు.
రియల్ గొడవలే....
హైదరాబాద్ లోని అంబర్ పేట్ కు చెందిన శ్రీనివాసరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. అయితే ఆయనకు, మరొకరికి మధ్య రియల్ వ్యాపారంలో మనస్పర్థలు తలెత్తాయి. కోట్ల రూపాయల వ్యాపారం కావడంతో ఎవరికి వారే తమకే భూములు చెందాలని భావిస్తారు. అదే కోవలో శ్రీనివాసరెడ్డిని ప్రత్యర్థులు సెటిల్మెంట్ కు పిలిచారు. సెటిల్మెంట్ కు శ్రీనివాసరెడ్డి తో పాటు రఘు అనే వ్యక్తి కూడా వెళ్లారు. అయితే ప్రత్యర్థులు జరిపిన కాల్పుల్లో శ్రీనివాసరెడ్డి మరణించగా, రఘుకు తీవ్రగాయాలయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Next Story