Mon Dec 23 2024 12:22:18 GMT+0000 (Coordinated Universal Time)
శ్వేత చౌదరి మరణానికి కారణం అదేనా..?
జగ్గయ్యపేట పరిధిలో చిల్లపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని రాత్రి 8 గంటలకు తల్లిదండ్రులకు వాట్సాప్ మెసేజ్ పంపింది.
కృష్ణా జిల్లా మంగళగిరి మండలం నువులూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ శ్వేత చౌదరి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె వయసు 22 సంవత్సరాలు. శ్వేత గత మూడు నెలలుగా ఇంటి నుంచే పని చేస్తోంది. మరో కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆదివారం కొత్త ఉద్యోగంలో జాయిన్ కావాల్సి ఉంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి బయలుదేరింది. రాత్రి 8 గంటల సమయంలో తాను డిప్రెషన్ లో ఉన్నానని, ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వాట్సాప్లో తల్లికి మెసేజ్ పంపింది.
జగ్గయ్యపేట పరిధిలో చిల్లపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని రాత్రి 8 గంటలకు తల్లిదండ్రులకు వాట్సాప్ మెసేజ్ పంపింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని బయటకు తీసి శవ పంచనామ నిమిత్తం మృతదేహాన్ని జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆమె మరణానికి గల కారణాలను తెలుసుకునే పనిలో ఉండగా.. ఆమె ఆన్ లైన్ లో మోసపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమెకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. సదరు వ్యక్తి లక్షా 20వేలు చెల్లిస్తే.. ఏడు లక్షలిస్తానని శ్వేతా చౌదరిని నమ్మించాడు. ఆమె తనదగ్గర డబ్బులు లేవని చెప్పడంతో అతడే రూ.50వేలు శ్వేతకు ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ రూ.50వేలతో కలిపి మిగిలిన డబ్బులను ఆమెతోనే కట్టించాడు. ఆ తర్వాత కూడా ఆమె రూ.1.30 లక్షలు చెల్లించింది. రెండు రోజులుగా అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ రాడవంతో తాను మోసపోయానని గ్రహించింది. ఏం చేయాలో తెలియక తీవ్ర ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఆమె ఫోన్ కాల్ డేటాతో పాటు డబ్బులు పంపిన ఎకౌంట్ వివరాలు, సోషల్ మీడియా ఫ్రెండ్స్ లిస్టును పోలీసులు సేకరిస్తున్నారు.
Next Story