Mon Dec 23 2024 05:11:09 GMT+0000 (Coordinated Universal Time)
ఒక్కడి ప్రేమోన్మాదం.. ఏడుగురిని చంపింది
ఇండోర్‌కు చెందిన శుభం దీక్షిత్(27) అనే వ్యక్తి ఇండోర్‌లోని విజయ్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు.
ఇండోర్ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో నిన్న తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. ఒక యువకుడి ప్రేమోన్మాదం ఏడుగురిని బలి తీసుకుంది. ఇండోర్‌కు చెందిన శుభం దీక్షిత్(27) అనే వ్యక్తి ఇండోర్‌లోని విజయ్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ప్రేమించాలని వెంటబడ్డాడు. కానీ, యువతి అతడి ప్రేమను నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి లోనైన ఆ యువకుడు.. యువతిపైన కోపంతో ఇంటి కింద పార్క్ చేసి ఉన్న ఆమె బైక్‌కు నిప్పు పెట్టాడు.
క్రమంగా మంటలు బైక్ నుంచి ఆ మూడంతస్థుల భవనానికి వ్యాపించాయి. భవనంలోని అన్ని ఫ్లాట్లకు మంటలు అలుముకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు ఇప్పటికే మరణించారు. మంటల భయంతో భవనంపై నుంచి కిందకు దూకిన మరో ఏడుగురికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ ఘటన జరిగినప్పుడు షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు భావించారు.
పార్కింగ్ స్థలంలో ఉన్న మీటర్లో మంటలు వచ్చి వాహనాలకు అంటుకున్నాయని, ఆ తర్వాత భవనం మొత్తానికి వ్యాపించాయని పోలీసులు చెప్పారు. కానీ, తర్వాత అసలు సంగతి బయటకు వచ్చింది. ప్రేమోన్మాది శుభం దీక్షిత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనలో మరణించిన వారికి మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Next Story