Sun Dec 22 2024 23:36:36 GMT+0000 (Coordinated Universal Time)
ఇంటిని ఖాళీ చేయమని అడుగుతున్న ఓనర్.. వర్షం బయట పెట్టిన ఊహించని నిజం
ఓ ఇంటి యజమాని తన ఇంటిని ఖాళీ చేయమని అద్దెదారులకు ఎంతగా చెప్పినా ఖాళీ చేయలేదు.
ఇంటిని అద్దెకు ఇస్తూ ఉంటారు.. అలా తీసుకున్నప్పుడు గోడల రంగులు పోవడమో.. కబోర్డులు విరిగిపోవడమో.. లేక చిన్న చిన్న సమస్యలు అద్దెకున్న ఇంట్లో సృష్టిస్తూ ఉంటారు. ఇల్లు వదిలిపెట్టి వెళ్లే సమయంలో ఏంటమ్మా.. ఇంటిని ఇలా పాడు చేశారు అని ఓనర్లు అనడం చాలా కామన్. అయితే ఓ ఓనర్ తన ఇంటిని చూడడానికి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఏకంగా అతడి ఇంటిలో అద్దెకు ఉన్న వ్యక్తులు సొరంగాన్ని త్రవ్వేశారు.
కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలోని మలవల్లి పట్టణంలోని ఓ ఇంటి యజమాని తన ఇంటిని ఖాళీ చేయమని అద్దెదారులకు ఎంతగా చెప్పినా ఖాళీ చేయలేదు. ఇటీవల వర్షం వచ్చి ఇంటి గోడ కూలిపోయింది. అలా అయినా తన ఇంటిని చూసుకునే అవకాశం వచ్చింది. తీరా ఇంట్లోకి వెళ్లేసరికి ఇంటి యజమానికి ఊహించని షాక్ కలిగింది. ఇంటిని అద్దెకు తీసుకునే ముందు, యజమాని అద్దెదారు నేపథ్యం గురించి ఆరా తీస్తాడు. అలా ఆరా తీయకుంటే ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటూ ఉంటాయని ప్రూవ్ అయింది.
మలవల్లి పట్టణంలోని కోటేవీధికి చెందిన పవిత్రరాజ్ తన ఇంటిని తస్లీం, ఆమె ఐదుగురు కుమారులకు అద్దెకు ఇచ్చాడు. గత సంవత్సరం నుండి వారు ఇంట్లో ఉంటూ వస్తున్నారు.. అయితే పవిత్రరాజ్ గత 2 నెలలుగా ఇంటిని ఖాళీ చేయమని కోరగా.. తస్లీం, ఆమె పిల్లలను ఇల్లు ఖాళీ చేయమని అంటూ వస్తున్నారు. ఏదో ఒక సాకుతో ఇల్లు ఖాళీ చేయలేదు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ ఇంటి గోడ కూలిపోయింది. అప్పుడు పవిత్రరాజ్ ఇంటి లోపలికి వెళ్లి చూడగా 12 అడుగుల సొరంగం, ఆయుధాలు, డ్రగ్స్ కనిపించాయి. దీంతో అతడు ఒక్కసారిగా షాకయ్యాడు. తన అద్దె ఇంటి బాత్ రూం దగ్గర 12 అడుగుల సొరంగం, ఆయుధాలు, మందు ఉండడంతో పవిత్రరాజ్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. అనంతరం మలవల్లి పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి ఇంట్లో డ్రగ్స్, ఆయుధాలు, తల్లి తస్లీమ్ను వదిలి పారిపోయారు. ఇంట్లో 12 అడుగుల సొరంగం తయారు చేశారని, అందులో డ్రగ్స్, ఆయుధాలు భద్రపరిచారని గుర్తించారు.
Next Story