Thu Dec 19 2024 23:46:51 GMT+0000 (Coordinated Universal Time)
దుంప తెగ.. ఇన్ని ఆస్తులా... ఎలా సంపాదించవురా సామీ... అవి చేతులేనా?
రెరా డైరెక్టర్ శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులను చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
రెరా డైరెక్టర్ శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులను చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఒకటా రెండా.. అతని ఆస్తుల విలువ 250 కోట్ల రూపాయలు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లోనే కాదు విశాఖలోనూ మనోడు ఆస్తులను కూడబెట్టేశాడు. దొరికిన కాడికి భూములు, భవనాలు సొంతం చేసుకున్నాడు. అక్రమ సంపాదనతో
ఫ్లాట్లు.. విల్లాలు...
విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 214 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నాగర్ కర్నూలు జిల్లాలో 38, సిద్ధిపేట జిల్లాలో ఏడు ఎకరాల భూమి ఉంది, విజయనగరం, విశాఖలో నాలుగు ఫ్లాట్స్ ను గుర్తించామని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర తెలిపారు. మొత్తం 29 ప్లాట్లను గుర్తించారు. ఏడు ఫ్లాట్లు, మూడు విల్లాలు కూడా ఉన్నాయని తెలిపారు. కుటుంబ సభ్యులు, ఇద్దరు మేనల్లుళ్లు, స్నేహితుల పేరుతో కొనుగోలు చేసినట్లు తెలిసిందన్నారు.
Next Story