Fri Nov 22 2024 18:38:51 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి
తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లి వస్తున్న ఇంజినీరింగ్
తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లి వస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు సమీపంలోని రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న 10 మంది విద్యార్థులు రెండు కార్లలో విహారయాత్రకు వెళ్లారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలోని గుడిసె పర్యాటక ప్రాంతానికి వెళ్లి గడిపారు. రాత్రి తిరిగి బయలుదేరారు. అర్ధరాత్రి దాటిన తర్వాత బూరుగుపూడి సమీపంలో కారు అదుపుతప్పి పాత, కొత్త వంతెనల మధ్యనున్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఉదయ్‌కిరణ్, హర్షవర్ధన్, హేమంత్ మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పోలీసులు మాట్లాడుతూ.. కోరుకొండ మండలంలోని బూరుపూడి వద్ద వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి కాలవలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందు కున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అల్లూరి జిల్లాలోని గుడిసె పర్యాటక కేంద్రానికి రెండు కార్లలో 10మంది ఇంజినీరింగ్ విద్యార్థులు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story