Mon Dec 15 2025 08:29:18 GMT+0000 (Coordinated Universal Time)
ప్రయివేటు బస్సు బోల్తా.. ఇరవై మందికి గాయాలు
ఆంధ్రప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయివేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.

ఆంధ్రప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయివేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇరవై మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. పోలీసుల కథనం ప్రకారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట లింగంగుంట్ల వద్ద అదుపుతప్పి బస్సు ప్రమాదానికి గురయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో నలభై మంది ప్రయాణికులున్నారు.
హైదరాబాద్ నుంచి...
హైదరాబాదు నుంచి కామాక్షి ట్రావెల్ బస్సు చిలకలూరిపేట మీదుగా కందుకూరు వెళ్లే క్రమంలో చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో పల్టీ కొట్టింది. అందులో సుమారుగా 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 20 మందికి స్వల్ప గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని,108 అంబులెన్సుల ద్వారా చిలకలూరిపేట, నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Next Story

