Wed Dec 25 2024 07:23:30 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : అరుణాచలం వెళ్లి వస్తుండగా కారు ప్రమాదం.. ఆంధ్ర విద్యార్థులు ఐదుగురు మృతి
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐదుగురు విద్యార్థులు మరణించారు
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏడుగురు విద్యార్థులు మరణించారు. వీరంతా రాష్ట్రంలోని అనేక జిల్లాలకు చెందిన విద్యార్థులు చెన్నై సమీపంలోని ఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నారు. రెండు రోజుల పాటు సెలవులు రావడంతో కారులో బయలుదేరి అరుణాచలం వెళ్లారు. అక్కడ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత ఏడుగురు విద్యార్థులు కారులో తిరిగి బయలుదేరారు.
కారును లారీ ఢీకొట్టగా...
అయితే తిరువళ్లూరు జిల్లా కనకమ్మ సత్రం సమీజంలో ఎదురుగా వచ్చిన లారీ వీరి కారును ఢీకొట్టడంతో కారులో ఉన్న ఐదుగురు విద్యార్థులు మరణించారు. మృతులు నితీష్, చేతన్, రామ్మోహన్, యుగేష్, బన్ను నితీష్ లు మరణించగా, విష్ణు, చైతన్యలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story