Mon Dec 23 2024 04:50:53 GMT+0000 (Coordinated Universal Time)
ఆదిలాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం అదుపుతప్పి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గుడిహత్నూర్ మండలంలోని మేకలగండి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చనిపోయినవారిని ఆదిలాబాద్ జిల్లా వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని కారణాలు తెలియాల్సి ఉంది.
మృతులందరూ ఆదిలాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. వారి వివరాల ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందిస్తున్నారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాలను కుటుంబసభ్యులకు అందించనున్నారు.క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తుండగా.. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల కుటుంబసభ్యులకు కూడా పోలీసులు సమాచారం అందించారు.
Next Story