Mon Dec 23 2024 05:05:57 GMT+0000 (Coordinated Universal Time)
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం
స్నేహితులకు పార్టీ ఇవ్వాలని భావించారు. ఓ ప్రాంతంలో పార్టీ చేసుకొని తిరిగి
ఏపీ అనంతరపురం జిల్లాలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారు కొని స్నేహితులకు యజమాని విందు ఇచ్చాడు. విందు ముగించుకుని తిరిగి వస్తుండగా చెట్టును కారు ఢీకొట్టింది.
తాడిపత్రి మండలం.. రావి వెంకటాంపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోగా.. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. నలుగురు ప్రయాణిస్తున్న కారు.. అదుపు తప్పి ఓ చెట్టును ఢీకొంది. స్పాట్లోనే ముగ్గురు చనిపోయారు. మరొకరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతులంతా తాడిపత్రి వాసులని తెలిసింది. ఈ నలుగురిలో ఒకరు కొత్తగా కారు కొనుగోలు చేశారు. దీంతో తన స్నేహితులకు పార్టీ ఇవ్వాలని భావించారు. ఓ ప్రాంతంలో పార్టీ చేసుకొని తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో రావివెంకటపల్లె సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story