Mon Dec 23 2024 04:31:36 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో దారుణం.. బాలిక మీద నుండి వెళ్లిన బస్సు
హైదరాబాద్ లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న గుంతల కారణంగా ఓ చిన్నారి ప్రాణాలు పోయాయి. తండ్రితో కలిసి బైక్ పై స్కూలుకు వెళుతున్న రెండో తరగతి చిన్నారి ఈ ప్రమాదంలో మృత్యువాత పడింది. ఈ దారుణం నగరంలోని బాచుపల్లిలో జరిగింది. రోజులాగే ఆ పాప తండ్రి బైక్ పై కూతురును స్కూలుకు తీసుకెళుతున్నాడు. రెడ్డీస్ ల్యాబ్ సమీపంలో బైక్ ఓ గుంతలో నుంచి వెళ్లడంతో పాప ఎగిరి కిందపడింది. బైక్ వెనకాలే వస్తున్న స్కూల్ బస్సు ఒకటి పాప పై నుంచి వెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన చిన్నారి అక్కడికక్కడే చనిపోయింది. పాప మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న వెంటనే బాచుపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. పాప బోరంపేటలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మూడోవ తరగతి చదువుతోంది. బస్సు డ్రైవర్ రహీం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే పాప మృతికి కారణంగా బాచుపల్లి సీఐ సుమన్ తెలిపారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. పరారీలో ఉన్న బస్సు డ్రైవర్ రహీమ్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.
Next Story