Mon Dec 23 2024 07:31:19 GMT+0000 (Coordinated Universal Time)
రెండు ముక్కలైన ద్విచక్రవాహనం.. కారులో మద్యం బాటిళ్లు
రాజేంద్రనగర్ ఆరంఘర్ చౌరస్తా లో కారు బీభత్సం సృష్టించింది. ఒక కారు అత్యంత వేగంగా వచ్చి
రాజేంద్రనగర్ ఆరంఘర్ చౌరస్తా లో కారు బీభత్సం సృష్టించింది. ఒక కారు అత్యంత వేగంగా వచ్చి మోటర్ సైకిల్ ను ఢీ కొట్టి అనంతరం విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది . దీంతో ఈ ప్రమాదంలో మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం రెండు ముక్కలు అవ్వగా.... విద్యుత్ స్తంభం పాక్షికంగా ధ్వంసమైంది. కారు లో ఎయిర్ బెలూన్స్ ఒపెన్ కావడంతో డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ కారు వదిలి అక్కడి నుండి పారిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
కారు లో మద్యం బాటిల్స్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఫుల్ గా మద్యం సేవించి కారు నడిపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కారు డ్రైవర్ మితిమీరిన వేగంతో కారు నడి ఓ వ్యక్తి ప్రాణాలు బలి తీసుకున్నాడు. మృతుడు కాటేదాన్ ప్రాంతానికి చెందిన రవి కాంత్ గా పోలీసులు గుర్తించారు. రవికాంత్ఆదివారం కావడంతో చికెన్ తేవడానికి ఆరంఘర్ చౌరస్తా కు మోటర్ సైకిల్ పై బయలుదేరాడు .కారు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. రవికాంత్ మరణించడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజేంద్రనగర్ పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Next Story