Mon Dec 23 2024 09:55:57 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బండ్లగూడ సన్ సిటీ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది.
హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బండ్లగూడ సన్ సిటీ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ తో వచ్చిన వాహనం వాకర్స్ మీదికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లి, కూతురు మృతి చెందారు. మంగళవారం ఉదయం ఓవర్ స్పీడ్తో వచ్చిన వాహనం మార్నింగ్ వాకర్స్పైకి దూసుకెళ్లింది. మృతులను అనురాధ, మమత లుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కారు నంబర్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు మూడు పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి.
కరీంనగర్ జిల్లాలో జరిగిన మరో రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను తీసింది. తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి సమీపంలో అర్థరాత్రి రాజీవ్ రహదారిపై బైక్ ను రాంగ్ రూట్లో వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టి్ంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. బైకుపై ఉన్న ముగ్గురిలో ఒకరు స్పాట్ లోనే చనిపోగా... మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతులు గుడ్డిపల్లి అరవింద్(28), శివరాత్రి సంపత్(27), శివరాత్రి అంజి(26) గుర్తించారు. రామంచ గ్రామానికి చెందిన గుడ్డిపల్లి అరవింద్(28), శివరాత్రి సంపత్(27), శివరాత్రి అంజి(26) ఇసుక పనికి వచ్చి తిరిగి రాత్రి ఇంటికి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
Next Story