Mon Dec 23 2024 07:34:28 GMT+0000 (Coordinated Universal Time)
ట్యాంక్‌బండ్‌పై నుండి హుస్సేన్ సాగర్ లో పడిపోయేదే
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం వేగంగా
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన కారు ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్‌లో అదుపుతప్పి రేలింగ్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. కొద్దిలో హుస్సేన్‌సాగర్‌లో కారు పడిపోయేది. ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారు క్షేమంగా బయటపడ్డారు. కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ప్రమాదం ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. ఫుట్‌పాత్‌పై ఉన్న ఓ చెట్టు కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో కారును అక్కడినుంచి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ శివార్లలోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద కూడా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. బైక్, కారు విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్నవారు మద్యం సేవించినట్లు తెలుస్తోంది. కారులో మద్యం సీసాలు కనిపించాయి.
Next Story