Mon Dec 23 2024 03:15:50 GMT+0000 (Coordinated Universal Time)
ప్రైవేటు బస్సు - ఆటో ఢీ : ఆరుగురు మహిళలు మృతి
మహిళలను ఎక్కించుకుని వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. ఎదురెదురుగా వస్తున్న ప్రైవేటు బస్సు - ఆటో ఢీ కొనడంతో..
కాకినాడ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. తాళ్లరేవు మండలం క్వారింగ పంచాయతీ పరిధిలోని సుబ్బరాయుని దిమ్మె కూడలిలో ప్రైవేటు బస్సు - ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలు మృతి చెందారు. మరో నలుగురిని యానాం ఆస్పత్రికి తరలించారు.
సీతారామపురంలోని రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తోన్న మహిళలు విధులు పూర్తయ్యాక నేలపల్లి, యానాం గ్రామాలకు ఆటోలో బయల్దేరారు. మహిళలను ఎక్కించుకుని వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. ఎదురెదురుగా వస్తున్న ప్రైవేటు బస్సు - ఆటో ఢీ కొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇద్దరి మృతదేహాలు ఆటోలో ఇరుక్కుపోగా.. స్థానికుల సహాయంతో బయటకు తీశారు. మృతదేహాలను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
Next Story