Mon Dec 23 2024 05:41:44 GMT+0000 (Coordinated Universal Time)
కోన సీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా మ్యాజిక్ వ్యాహనం.. ఓ కారును ఢీకొట్టిన ఘటనలో
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా మ్యాజిక్ వ్యాహనం.. ఓ కారును ఢీకొట్టిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అలమూరు మండలం అలిక్కి దగ్గర జాతీయ రహదారి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టాటామ్యాజిక్ వాహనాన్ని వేగంగా దూసుకువచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో మరో 9 మందికి గాయాలయ్యాయి. వైజాగ్ ఎయిర్ పోర్టు నుంచి నలుగురితో భీమవరం వెళుతున్న కారుని ఢీకొట్టడంతో మడికి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్లో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా , కారులో ఒకరు మృతి చెందారు. గాయపడిన వారిని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సర్పంచ్ మృతి:
కరీంనగర్ జిల్లా కొత్తగట్టు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో హుజురాబాద్ మండలం కనుకుల గిద్దె సర్పంచ్ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హుజురాబాద్ మండలం కనుకుల గిద్దె గ్రామ సర్పంచ్ గోపు కొమురా రెడ్డి అనే వ్యక్తి కరీంనగర్ నుండి స్వగ్రామానికి వస్తున్నారు. శనివారం ఉదయం గొల్లపల్లె కొత్తగట్టు గ్రామాల మధ్యలో ప్రమాదవశాత్తు జాతీయ రహదారిపై చెట్టును ఢీకొని కొమురారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని హుజురాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
Next Story