Sun Dec 22 2024 06:54:21 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం
ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దామరచర్ల మండలం బత్తులపాలెం వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బాధితులను టాటా నెట్వర్క్లో పనిచేస్తున్న కె యాధి (22), ఎస్కె రిజ్వాన్ (36)గా గుర్తించారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న మహీంద్రా బొలెరో ఎస్యూవీని డీసీఎం ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో యాధి, రిజ్వాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కర్నూలు జిల్లా ఆలూరు మండలం హులేబీడు గ్రామ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆదోని పట్టణం ఫరిస్సా మొహల్లా వీధిలో నివాసం ఉండే ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఆదివారం ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో బంధువుల శుభకార్యానికి మహీంద్రా జైలో కారులో వెళ్లారు. సాయంత్రం తిరిగి బళ్లారి నుంచి అదే కారులో ఆదోనికి వెళ్తున్నారు. కారు ఆలూరు మండలంలోని హులేబీడు గ్రామ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సాబెరా (60), మేస్త్రీ గౌస్ (45), నస్రీన్ (32) అక్కడికక్కడే మృతి చెందారు. కారు టైర్ పంక్చర్ కావడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు.

Next Story