Mon Dec 23 2024 04:22:22 GMT+0000 (Coordinated Universal Time)
నంద్యాలలో రోడ్డు ప్రమాదం
కర్ణాటకలో రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందినవారు ప్రాణాలు కోల్పోయారు. యాదగిరి జిల్లాలో ఆగి ఉన్న లారీని జీపు ఢీకొట్టింది.
ఏపీలోని నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తండ్రి, కూతురు చనిపోయారు. కంపమల్ల - దొర్నిపాడు రోడ్డు మార్గంలో సోమవారం నాడు ఈ ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రి, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో ఇద్దరిని ఆళ్లగడ్డ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద బాధితులను దొర్నిపాడు వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.ఆ తర్వాత మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కర్ణాటకలో రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందినవారు ప్రాణాలు కోల్పోయారు. యాదగిరి జిల్లాలో ఆగి ఉన్న లారీని జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. మృతులను నంద్యాల జిల్లా వెలుగోడు వాసులుగా గుర్తించారు. కలబురిగిలోని దర్గా ఉరుసు జాతరకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను మునీర్(40), నయామత్(40), రమీజా బేగం(50), ముద్దత్ షీర్ (12), సుమ్మి(13)గా గుర్తించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story