Sat Jan 11 2025 18:59:03 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
జిల్లాలోని మనుబోలు మండలం బద్దెవోలు వద్ద ఓ లారీని కారు ఢీ కొట్టిన ప్రమాదంలో ఒక మహిళ, చిన్నారి సహా..
నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని మనుబోలు మండలం బద్దెవోలు వద్ద ఓ లారీని కారు ఢీ కొట్టిన ప్రమాదంలో ఒక మహిళ, చిన్నారి సహా ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా.. బద్దెవోలు అడ్డరోడ్డు సమీపంలో ఆగిఉన్న లారీని ఇన్నోవా కారు ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. కోడవనూరు మండలం దమరిగుంట నుంచి చెన్నైకి కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగిందని వివరించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
Next Story