Mon Dec 23 2024 20:12:49 GMT+0000 (Coordinated Universal Time)
ఆటోను ఢీ కొట్టిన లారీ, ముగ్గురు మృతి..9 మందికి గాయాలు
రేణిగుంట-నాయుడుపేట ప్రధాన రహదారిపై శ్రీకాళహస్తి అర్ధనారీశ్వరస్వామి ఆలయం దగ్గరలో ఎదురుగా వచ్చిన లారీ ఆటోను
శ్రీకాళహస్తి : సోమవారం ఉదయం తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శ్రీకాళహస్తి శివారులోని పూతలపట్టు - నాయుడుపేట రోడ్డులో వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో 9 మంది గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. చంద్రగిరికి చెందిన 12 మంది నాయుడుపేట సమీపంలో ఉన్న కనువూరమ్మ అమ్మవారిని దర్శించుకుని, ఆటోలో తిరుగుపయనమయ్యారు.
అదే సమయంలో రేణిగుంట-నాయుడుపేట ప్రధాన రహదారిపై శ్రీకాళహస్తి అర్ధనారీశ్వరస్వామి ఆలయం దగ్గరలో ఎదురుగా వచ్చిన లారీ ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో అర్జునయ్య, నరసమ్మ అనే దంపతులతో పాటు.. మారెమ్మ (కావ్య) అక్కడికక్కడే చనిపోయారు. నలుగురు చిన్నారులు సహా మొత్తం 9 మంది గాయపడగా.. క్షతగాత్రులను శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ మద్యంమత్తులో వాహనం నడపడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story