Mon Dec 23 2024 14:08:34 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా మహారాష్ట్రకు చెందిన..
తిరుపతి జిల్లాలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో నలుగురు మృతి చెందారు. చంద్రగిరి మండలం కల్రొడ్డుపల్లి వద్ద కల్వర్టును కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా మహారాష్ట్రకు చెందిన భక్తులుగా గుర్తించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుని.. కాణిపాకం వినాయకుడి దర్శనార్థం వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రమాద సమయంలో వ్యాన్ లో 9 మంది భక్తులున్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story