Mon Dec 23 2024 12:01:29 GMT+0000 (Coordinated Universal Time)
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. అయోధ్య - లక్నోల మధ్య ఈ ప్రమాదం జరుగుతుంది. తెల్లవారుజామున వేగంగా వస్తున్న కారు ఆగిఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఒకే కుటుంబానికి చెందిన...
ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ జిల్లాలోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. వీరంతా గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story