Sun Dec 22 2024 23:29:21 GMT+0000 (Coordinated Universal Time)
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురి మృతి
ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. ముస్సోరీ - డెహ్రాడూన్ హైవేపై షేర్ ఘడి సమీపంలో ముస్సోరీకి ఐదు కిలోమీటర్ల దూరంలో..
ఉత్తరాఖండ్ లో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. 22 మంది ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు లోయలో పడిపోయింది. ముస్సోరీ డెహ్రాడూన్ మార్గంలో బస్సు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. ముస్సోరీ - డెహ్రాడూన్ హైవేపై షేర్ ఘడి సమీపంలో ముస్సోరీకి ఐదు కిలోమీటర్ల దూరంలో బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు ముస్సోరీ నుంచి డెహ్రాడూన్ కు తిరిగి వెళ్తుండగా షేర్ ఘాడీ సమీపంలో 100 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది.
ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. లోయలో పడిపోయిన బాధితులను ఒక్కొక్కరిగా బయటకు తీసుకొస్తున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇండో - టిబెటియన్ బోర్డర్ ఫోర్స్ (ఐటీబీపీ) సహాయక చర్యలను చేపట్టింది. 19 మంది గాయపడగా వారందరినీ డెహ్రాడూన్ కు తరలించారు. ప్రమాదంలో ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. కాగా.. ప్రమాదానికి గల కారణమేంటనేది తెలియరాలేదు.
Next Story