Mon Dec 23 2024 06:39:15 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
విశాఖపట్నంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టాటా హేరియర్ వాహనం అతివేగంగా దూసుకొస్తూ..
విశాఖపట్నంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టాటా హేరియర్ వాహనం అతివేగంగా దూసుకొస్తూ.. ఫ్లైఓవర్ మీద వెళ్తున్న ఓ బైకు, స్కూటీలను ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఫ్లైఓవర్ మీద నుండి 30 అడుగుల కిందకి పడిపోయాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. టాటా హేరియర్ నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో వేగంగా వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో స్కూటీ నుజ్జునుజ్జు అయ్యింది.
ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఫ్లైఓవర్ పై నుండి కిందపడిన జై కృష్ణ అనే వ్యక్తి తలకు బలమైన గాయాలు కావడంతో, చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడు విజయవాడకు చెందినవాడు. మరో ఇద్దరిని యశ్వంత్ (అల్లిపురం), హరి కుమార్ (అక్కయ్యపాలెం)లుగా గుర్తించారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. AP 39 LF 5999 నెంబర్ గల టాటా హేరియర్ కానుని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Next Story